ఏ వైరస్‌కైనా... ఇక ఒకే ‘టీకా’ ?

ABN , First Publish Date - 2022-01-12T02:26:56+05:30 IST

కరోనా మ‌హ‌మ్మారి రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. పలు ర‌కాల వేరియంట్లు భ‌యాందోళ‌న‌లను రేకెత్తిస్తున్నాయి.

ఏ వైరస్‌కైనా... ఇక ఒకే ‘టీకా’ ?

లండన్ : కరోనా మ‌హ‌మ్మారి రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. పలు ర‌కాల వేరియంట్లు భ‌యాందోళ‌న‌లను రేకెత్తిస్తున్నాయి. దీని నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు ప్ర‌స్తుతానికైతే... కొన్ని ర‌కాల టీకాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.  అయితే... అన్ని ర‌కాల వైర‌స్ వేరియంట్ల నుంచి, ఒక్క మాటలో చెప్పాలంటే... ఏ వైరస్‌ నుంచైనా సరే... ర‌క్ష‌ణ పొందేందుకు... ఒక‌టే టీకాను తీసుకొచ్చేందుకు శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవ‌డం ద్వారా... శ‌రీరంలో ‘టి’ కణాల ఉత్ప‌త్తి పెరుగుతుందని, పరిశోధనలు ఇప్పటికే ఈ విషయాన్ని చెబుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.  అయితే... టి క‌ణాల ఉత్ప‌త్తి పెంచ‌డం ద్వారా... ఒమిక్రాన్ సహా ఏ వైరస్/వేరియంట్ నుంచైనా ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు అవ‌కాశముంటుంద‌ని లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజీ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.


‘సార్వ‌త్రిక టీకా’ల త‌యారీకి ప్ర‌స్తుతం ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. వైర‌స్ సోకిన‌పుడు టీ క‌ణాల స్పంద‌న ఆధారంగా టీకాల‌ను త‌యారు చేయ‌నున్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  టీకాలు తీసుకున్న‌ప్పుడు యాంటీబాడీల వ‌ల‌్ల వైర‌స్ స్పైక్ ప్రోటీన్‌ల‌పై ఒత్తిడి ఏర్ప‌డుతుంది.  దీనికి భిన్నంగా క‌రోనా మ‌హమ్మారి వేరియంట్ల‌లో వైర‌స్ లోప‌ల ఉత్ప్రరివ‌ర్త‌నాలు జ‌రుగుతుంటాయి.  ఈ ‘టి’ క‌ణాలు వాటిని ల‌క్ష్యంగా చేసుకొని ఉత్ప్రరివ‌ర్త‌నాల‌ను నిలుపుద‌ల చేసేలా ప‌నిచేసేట్లుగా సార్వ‌త్రిక ‘టీకా’ల‌ను త‌యారు చేసే దిశగా ప్రయోగాలు జరుగుతున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-01-12T02:26:56+05:30 IST