జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్...ఉగ్రవాది హతం

ABN , First Publish Date - 2020-06-05T11:16:13+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలోని కాలాకోటి ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు....

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్...ఉగ్రవాది హతం

రాజౌరి (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలోని కాలాకోటి ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. రాజౌరీలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర ఆర్మీ బలగాలు గాలింపు చేపట్టాయి. గాలిస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా, ఆర్మీ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడని రాజౌరి-పూంచ్ డీఐజీ వివేక్ గుప్తా చెప్పారు. ఉగ్రవాది మృతదేహం వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం తాము గాలింపు కొనసాగిస్తున్నామని డీఐజీ వివేక్ గుప్తా చెప్పారు.

Updated Date - 2020-06-05T11:16:13+05:30 IST