వరుణ్ణి గొడ్డలితో బెదిరించి... వధువుకు తిలకం దిద్దిన ప్రియుడు!
ABN , First Publish Date - 2021-05-15T17:36:16+05:30 IST
యూపీలోని గోరఖ్‌పూర్‌లో వన్‌సైడ్ లవ్వర్ కల్యాణమండపానికి...
గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్‌లో వన్‌సైడ్ లవ్వర్ కల్యాణమండపానికి గొడ్డలితో వచ్చి కలకలం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే గోరఖ్‌పూర్‌లోని ఒక కల్యాణ మండపంలో ఘనంగా వివాహ వేడుక జరుగుతోంది. వధూవరులు దండలు మార్చుకుంటున్నారు. ఇంతలో పిప్రాయిచ్ ప్రాంతానికి చెందిన గోలు విశ్వకర్మ గొడ్డలి తీసుకుని వివాహ వేదికపైకి వచ్చాడు.
వరునికి గొడ్డలిని చూపించి, వధువు నుదుటన సింధూరం పెట్టాడు. ఈ హఠాత్ పరిణామానికి వరునితోపాటు అక్కడున్నవారంతా కంగుతిన్నారు. కొద్దిసేపటికి వారంతా తేరుకుని ఆ యువకుడిని పట్టుకుని, దేహశుద్ధి చేశారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన తరువాత వరుని తరుపువారు వధువును తమతో పాటు తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. దీంతో పెద్దల పంచాయితీ జరిగింది. ఎట్టకేలకు ఆ మర్నాడు అప్పగింతల కార్యక్రమం జరిగింది.