రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-07-25T04:06:40+05:30 IST

స్థానిక ఆదిశంకర కళాశాల సమీపంలోని జాతీయరహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

గూడూరురూరల్‌, జూలై 24: స్థానిక ఆదిశంకర  కళాశాల సమీపంలోని జాతీయరహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు  గూడూరులోని చెన్నూరుకు చెందిన శివకుమార్‌(27) నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అతను మోటారుసైకిల్‌పై చెన్నూరుకు వస్తుండగా ఆదిశంకర సమీపంలోని జాతీయరహదారి వద్ద చెన్నైవైపు వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో శివకుమార్‌ మృతిచెందాడు. రూరల్‌ ఎస్‌ఐ పుల్లారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-25T04:06:40+05:30 IST