హైదరాబాద్ సిటీ/సైదాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా ప్రకటన బోర్డు ఏర్పాటు చేసిన స్కూల్‌కు జీహెచ్‌ఎంసీ గురువారం లక్ష రూపాయల జరిమానా విధించింది. సైదాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న సక్సెస్ పాఠశాల భవనానికి నిర్వాహకులు విద్యుత్ లైట్లతో పెద్ద బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అధికారులు ఈ మేరకు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు.