ముగ్గురు భారత వాయుసేన ఉద్యోగుల హోం క్వారంటైన్

ABN , First Publish Date - 2020-04-05T13:16:31+05:30 IST

తబ్లిగ్ జమాత్ సమావేశం జరిగిన ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన భారత వాయుసేన ఉద్యోగిని ముందుజాగ్రత్త చర్యగా 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌కు పంపించారు.

ముగ్గురు భారత వాయుసేన ఉద్యోగుల హోం క్వారంటైన్

న్యూఢిల్లీ : తబ్లిగ్ జమాత్ సమావేశం జరిగిన ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన భారత వాయుసేన ఉద్యోగిని ముందుజాగ్రత్త చర్యగా 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌కు పంపించారు. భారత వాయుసేన విభాగానికి చెందిన ఓ ఎయిర్‌మెన్ ఢిల్లీ వైమానిక కేంద్రంలో పనిచేస్తూ నిజాముద్దీన్ ప్రాంతంలో నివాసముంటున్నారు. తబ్లిగ్ జమాత్ సమావేశం జరిగిన నిజాముద్దీన్ ప్రాంతం కరోనా వైరస్ కు ప్రధాన హాట్ స్పాట్ గా మారినందున ముందుజాగ్రత్తగా అదే ప్రాంతానికి చెందిన ఎయిర్ మెన్ ను హోం క్వారంటైన్ చేశారు. ఇతనితో కలిసిన మరో ఇద్దరు వాయసేన ఉద్యోగులను కూడా హోం క్వారంటైన్ కు తరలించామని భారత వాయుసేన అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-04-05T13:16:31+05:30 IST