పున్నమి వేళ.. పుడమి పూజ

ABN , First Publish Date - 2021-06-24T04:37:13+05:30 IST

ఏరువాక పౌర్ణమిని రైతులు పండుగలా జరుపుకోవ డం ఆనవాయితీగా వస్తున్నది.

పున్నమి వేళ.. పుడమి పూజ
నారాయణపేటలో ఎద్దులకు అలంకరించే తాళ్లను కొంటున్న రైతులు

- నేడు ఏరువాక పౌర్ణమి 


నారాయణపేట, జూన్‌ 23 : ఏరువాక పౌర్ణమిని రైతులు పండుగలా జరుపుకోవ డం ఆనవాయితీగా వస్తున్నది. ఏటా వచ్చే జేష్ఠ శుద్ధ పౌర్ణమినే ఏరువాక పున్నంగా పిలుచుకునే రైతులు, ఆ రోజు ఎద్దులు, వ్యవసాయ పని ముట్లు, వరుణుడు, భూ త ల్లికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా గురువారం ఏరువాక పౌర్ణమిని జరుపుకునేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతులు సిద్ధం అయ్యారు. 


ఇదీ పండుగ తీరు..

ఏరువాక సందర్భంగా రైతులు ఎద్దులను అందంగా ముస్తాబు చేస్తారు. ఎద్దు కొ మ్ములకు రంగులు అద్దుతారు. వ్యవసాయ పనిముట్లకు పూజలు చేస్తారు. వానాకా లం సాగు కలిసి రావాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటారు. గ్రామ దేవతలకు బోనాల సమర్పించి, సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణుడిని ప్రార్థిస్తారు. అనంతరం పొలా లకు వెళ్లి పుడమికి పూజలు చేసి, ఏరువాక సాగును ప్రారంభిస్తారు. సాయంత్రం అ లంకరించిన ఎద్దులను వీధుల్లో ఊరేగిస్తారు. ఎద్దులతో ఏరువాక తాడును తెంపి స్తారు. ఏరువాక నుంచి వ్యవసాయ పనులు మొదలుకావడంతో పని ఒత్తిడితో సత మతమయ్యే ఎద్దులకు బలం చేకూరే విధంగా కోడిగుడ్లు, కారింగులను తాపిస్తారు. కొన్ని గ్రామాల్లో మాత్రం సంప్రదాయం ప్రకారం కొన్ని వర్గాలకు చెందిన వారి ఎ ద్దులు మాత్రమే ఏరువాక తాడును తెంపుతాయి. కాగా, పండుగ రోజు కాడెద్దులకు ప్రత్యేకంగా పూజలు చేసి, భక్షాలు తినిపిస్తారు.

Updated Date - 2021-06-24T04:37:13+05:30 IST