57 దేశాల్లో BA.2 Omicron సబ్ వేరియంట్...ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

ABN , First Publish Date - 2022-02-02T14:21:17+05:30 IST

ప్రపంచంలోని 57 దేశాల్లో ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కనుగొన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది....

57 దేశాల్లో BA.2 Omicron సబ్ వేరియంట్...ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

 జెనీవా: ప్రపంచంలోని 57 దేశాల్లో ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కనుగొన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమైక్రాన్ కరోనావైరస్ కంటే బీఏ.2 సబ్ వేరియంట్ మరింత అంటువ్యాధి అని అధ్యయనంలో వెల్లడైందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.పది వారాల క్రితం దక్షిణాఫ్రికాలో మొదటిసారి కనుగొన్న ఒమైక్రాన్ భారీగా పరివర్తన చెందిందని ప్రపంచఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ అప్ డేట్ లో తెలిపింది. కరోనా వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించడానికి బీఏ.2 సంబంధించిన సబ్ వేరియంట్ కేసుల్లో స్పష్టమైన పెరుగుదల ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.


బీఏ.2 సబ్ వేరియంట్ వృద్ధిరేటులో స్వల్ప పెరుగుదల ఉందని డబ్ల్యూహెచ్‌వో కొవిడ్ నిపుణుడు మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. కోవిడ్ ప్రమాదకరమైన వ్యాధిగా మిగిలిపోయిందని, ప్రజలు వైరస్ సోకకుండా చూసుకోవాలని మరియా వాన్ కెర్ఖోవ్ నొక్కి చెప్పారు.


Updated Date - 2022-02-02T14:21:17+05:30 IST