Bengalurలో ఒకేరోజు 142 ఒమైక్రాన్‌ కేసులు

ABN , First Publish Date - 2022-01-05T17:09:53+05:30 IST

నగరంలో మంగళవారం రాత్రి వరకు 142 ఒమైక్రాన్‌ కేసులు వెలుగుచూశాయని, కొవిడ్‌ కేసులు 3048 కేసులు నమోదయ్యాయని మంత్రులు తెలిపారు. కేసుల సంఖ్య క్రమేపీ రెట్టింపు అవుతోందని రానున్న వారం రోజుల్లో

Bengalurలో ఒకేరోజు 142 ఒమైక్రాన్‌ కేసులు

బెంగళూరు: నగరంలో మంగళవారం రాత్రి వరకు 142 ఒమైక్రాన్‌ కేసులు వెలుగుచూశాయని, కొవిడ్‌ కేసులు 3048 కేసులు నమోదయ్యాయని మంత్రులు తెలిపారు. కేసుల సంఖ్య క్రమేపీ రెట్టింపు అవుతోందని రానున్న వారం రోజుల్లో ఇది 10 వేలు దాటే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. రెండు వారాలపాటు అమలులో ఉండే ఆంక్షలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక వివాహాది శుభ కార్యాలకు కల్యాణ మండపాలలో 100 మందిని, ఆరు బయట జరిగితే 200 మందిని అనుమతిస్తామని, వీటిని కట్టుదిట్టంగా పాటించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారందరూ తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు జరుపుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు సరిహద్దులో నిఘాను తీవ్రతరం చేస్తామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రప్రభుత్వ సూచనలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కొవిడ్‌ స్వైర విహారం చేస్తున్న మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లో పరిస్థితులను బేరీజు వేసి రాజధాని బెంగళూరులో రెండు వారాలపాటు కఠిన ఆంక్షలు అమలు చేయాలని తీర్మానించామన్నారు. ఇందులో భాగంగా బెంగళూరుకోసమే ప్రత్యేక మార్గదర్శక సూత్రాలను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2022-01-05T17:09:53+05:30 IST