Viral Video: వరద నీటిలో మునిగిపోతున్నా సెల్ఫీ తీసుకున్న మహిళ.. వైరల్ అవుతున్న పాత వీడియో!

ABN , First Publish Date - 2022-07-13T20:53:31+05:30 IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాలు వరద తాకిడికి గురవుతున్నాయి.

Viral Video: వరద నీటిలో మునిగిపోతున్నా సెల్ఫీ తీసుకున్న మహిళ.. వైరల్ అవుతున్న పాత వీడియో!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాలు వరద తాకిడికి గురవుతున్నాయి. చాలా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరదలకు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ మహిళ సెల్ఫీ సరదా కోసం ప్రమాదాన్ని కూడా లెక్క చేయలేదు. వరదను కూడా లెక్క చేయకుండా సెల్ఫీ వీడియో తీసుకునేందుకు ప్రయత్నించింది. 




ఆ వీడియోలో ఒక మహిళ వరద నీటిని చిత్రీకరించేందుకు సెల్ఫీ స్టిక్ పట్టుకుని ఉంది. వేగంగా వస్తున్న వరద నీటిని కెమేరాలో బంధించేందుకు ప్రయత్నించింది. చివరకు వరద నీరు ఆ మహిళను ముంచెత్తింది. ఆ మహిళ వరద నీటిలో పడిపోయింది. అయినా ఆమె సెల్ఫీ స్టిక్‌ను వదలలేదు. గొంత వరకు నీటిలో మునిగపోయినా ఆమె వీడియో చిత్రీకరిస్తూనే ఉంది. తాజాగా అప్‌లోడ్ చేసిన ఆ వీడియోను దాదాపు 4.68 లక్షల మంది చూశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-13T20:53:31+05:30 IST