దాడి చేస్తారన్న భయంతో వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-06T05:06:32+05:30 IST

మండలంలోని ఎల్‌కే తండా గ్రామానికి చెందిన లింబేనాయక్‌(60) అనే వృద్ధుడు దాడి చేయడానికి వచ్చారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

దాడి చేస్తారన్న భయంతో వృద్ధుడి ఆత్మహత్య

గడివేముల, డిసెంబరు 5: మండలంలోని ఎల్‌కే తండా గ్రామానికి చెందిన లింబేనాయక్‌(60) అనే వృద్ధుడు దాడి చేయడానికి వచ్చారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమ కుటుంబంలోని ఓ మహిళతో హునానాయక్‌కు వివాహేతర సంబంధం ఉందని, తమ ఇంటి వద్దకు రావొద్దని అతడిని అన్నదమ్ముళ్లు లింబేనాయక్‌, నానునాయక్‌ హెచ్చరించారు. అయితే హునానాయక్‌తో పాటు రాజునాయక్‌, శైలబాయి, లోకనాయక్‌, తిరుపాల్‌నాయక్‌ కలిసి నానునాయక్‌పై దాడి చేశారు. లింబేనాయక్‌ను కొట్టడానికి వెళ్లగా అతడు భయపడి శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. లింబేనాయక్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-06T05:06:32+05:30 IST