అధికారులు సమన్వయంతో పని చేయాలి

ABN , First Publish Date - 2022-05-21T06:17:42+05:30 IST

అధికారులు, గ్రామపంచాయతీల సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎస్సారెస్పీ కాల్వకు ఇరువైపులా మొక్కలు నాటాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌ అన్నారు.

అధికారులు సమన్వయంతో పని చేయాలి
మద్దిరాలలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ హేమంత్‌

ఎస్సారెస్పీ కాల్వకు ఇరువైపులా మొక్కలు నాటాలి 

అదనపు కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌ పాటిల్‌

మద్దిరాల, మే 20: అధికారులు, గ్రామపంచాయతీల సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎస్సారెస్పీ కాల్వకు ఇరువైపులా మొక్కలు నాటాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌ అన్నారు. శుక్రవా రం మద్దిరాల మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ నెల 23 నుంచి మద్దిరాల మండలంలోని గోరెంట్ల గ్రామం నుంచి పోలుమళ్ల వరకు మూడున్నర కిలోమీటర్ల ఎస్సారెస్పీ కాల్వకు ఇరువైపులా ఎకరానికి ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కొ పార్కులో 4000 మొక్కల చొప్పున మొత్తం 60 పార్కుల్లో 2.40లక్షల మొక్కలు నాటించాలన్నారు. మొక్కల సంరక్షణకు గ్రామ పంచాయతీలకు నెలకు రూ.13లక్షల చొప్పున 20 నెలలు బిల్లులు చెల్లిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్కుల్లో పండ్ల మొక్కలను నాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి పెంటయ్య, నీటి పారుదల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణ, డిప్యూటీ ఇంజనీర్‌ హరికృష్ణ, ఎంపీడీవో సరోజ, తహసీల్దార్‌ అమీద్‌సింగ్‌, ఏపీవో వెంకన్న, ఈసీ చారి, టీఏ మురళీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-21T06:17:42+05:30 IST