స్నేహితులు మోసగించారంటూ మనస్తాపం

ABN , First Publish Date - 2020-07-10T11:17:06+05:30 IST

స్నేహితులకు అప్పు ఇప్పించాడు.. అయితే వారు తిరిగి అప్పు చెల్లించలేదు.

స్నేహితులు మోసగించారంటూ మనస్తాపం

ఏలూరులో యువకుడి ఆత్మహత్య 


ఏలూరు క్రైం, జూలై 9 : స్నేహితులకు అప్పు ఇప్పించాడు.. అయితే వారు తిరిగి అప్పు చెల్లించలేదు. దీంతో తనను స్నేహితులు మోసగించారని మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రామ కృష్ణాపురానికి చెందిన నెల్లి ఫణికుమార్‌ (27) తాపీ పనులు చేస్తుంటాడు. అతని తల్లి ఐదేళ్ల క్రితం మరణించగా, తండ్రి ఏడాది క్రితం మరణించాడు. అతనికి సోద రి ఉండగా ఆమెకు వివాహం కాగా గొల్లాయిగూడెంలోనే ఉంటోంది. అతను తాపీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. తన స్నేహితులైన గణపతి, రాజేశ్‌ లకు వేరే వద్ద నుంచి రూ.మూడు లక్షలు ఒకరికి, రూ.నాలుగు లక్షలు మరొకరికి అప్పుగా ఇప్పించి ఫణికుమార్‌ జామీనుగా ఉన్నాడు. వారిద్దరీ అప్పు సొమ్ము చెల్లిం చకుండా తాము కట్టలేమంటూ చెప్పడంతో ఉద్దేశ్య పూర్వకంగానే తనను అడ్డంపెట్టి మోస గించా రని భావించాడు.


జీవితంపై విరక్తి పెంచుకుని ఈ మేరకు ఒక సూసైడ్‌ నోట్‌ రాసి గురువారం మధ్యాహ్నం తన ఇంట్లోనే కరెంటు వైరుతో ఫ్యానుకు ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం ఏలూరు త్రీటౌన్‌ పోలీసులకు అం ద డంతో త్రీటౌన్‌ ఎస్‌ఐ ఎం.వెంకటరమణ సిబ్బందితో  ఘటనా స్థలానికి వెళ్లి పరి శీ లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-10T11:17:06+05:30 IST