578.10 అడుగులుగా సాగర్ నీటి మట్టం
ABN , First Publish Date - 2022-01-10T05:08:59+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజె క్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 578.10 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 578.10అడుగులు(277.5334టీఎంసీలు)గా ఉంది.
నాగార్జునసాగర్, జనవరి9: నాగార్జునసాగర్ ప్రాజె క్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 578.10 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 578.10అడుగులు(277.5334టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి కుడి కాల్వకు 8755 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 4287 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 1800 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 8400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 23242 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువ నుంచి ఎలాంటి నీటిరాక లేదు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 856.80.అడుగులుగా ఉంది. ఎగువ నుంచి శ్రీశైలానికి ఎటువంటి నీటి రాక లేదు.
సాగర్‌లో పర్యాటకుల సందడి
సంక్రాంతి సెలవులు కావడంతో ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సాగర్ అందాలను తిలకించేందుకు ఇక్కడికి వచ్చారు. దీంతో సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనుపు, బుద్ధవనం, ఎత్తిపోతల, కొత్త వంతెన తదితర ప్రాంతాల వద్ద పర్యాటకులు సందడి నెలకొంది. హిల్‌కాలనీ డౌన్ పార్కు వద్ద ఉన్న లాంచీ స్టేషన్ నుంచి పర్యాటకశాఖ జలాశయంలో నాలుగు జాలీ ట్రిప్పులు లాంచీలు నడిపినట్లు లాంచీస్టేషన్ అధికారులు తెలిపారు.