ప్రభుత్వ స్థలం కబ్జా
ABN , First Publish Date - 2022-03-04T16:07:39+05:30 IST
ప్రభుత్వ స్థలం క్రమబద్ధీకరణకు జీవో విడుదల కావడంతో బస్తీల్లో మిగులు స్థలాలపై కబ్జాదారుల కన్నుపడింది. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపించినా దాన్ని
నిర్మాణాలు కూల్చివేత
బోర్డు ఏర్పాటు
హైదరాబాద్/బంజారాహిల్స్: ప్రభుత్వ స్థలం క్రమబద్ధీకరణకు జీవో విడుదల కావడంతో బస్తీల్లో మిగులు స్థలాలపై కబ్జాదారుల కన్నుపడింది. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపించినా దాన్ని ఆక్రమించి ఆగమేఘాల మీద నిర్మాణాలు చేపడుతున్నారు. తాజాగా ఫిలింనగర్ బీజేఆర్ నగర్‌లోగల 150 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి తాత్కాలిక నిర్మాణాలు చేశాడు. సమాచారం అందుకున్న షేక్‌పేట రెవెన్యూ సిబ్బంది గురువారం కూల్చివేసి స్థలంలో ప్రభుత్వ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త వాటికి క్రమబద్ధీకరణ అవకాశం లేదని స్పష్టం చేశారు.