Abn logo
Jul 24 2021 @ 23:19PM

మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరం

కమిషనర్‌కు వినతి పత్రం అందజేస్తున్న పురప్రజలు

ప్రొద్దుటూరు, జూలై 24: పట్టణంలోని కొత్త డ్రాప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌పై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేర కు కమిషనర్‌ రాఽధను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త డ్రాప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌లో వెదుర్ల బజార్‌, గౌరమ్మకట్టవీధి రోడ్ల విస్తరణ 60 అడుగులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారని ఈ రోడ్లలో గతంలో బస్సులు, లారీలు తిరుగుతున్నప్పుడే 40 అడుగుల వెడల్పు ఉండేదని, ప్రస్తుతం ఈ వీధుల్లో ఆటో లు,  కార్లు తప్ప భారీ వాహనాలు నడవడంలేదన్నారు. ఈ ప్రాంతమంతా ఓల్డ్‌బిల్డప్‌ ఏరియా కాబట్టి రోడ్డు విస్తరణ మొదలు పెడితే కొన్ని గృహాలు పూర్తిగా  పోయే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం పట్టణం చుట్టూ బైపాస్‌ ఏర్పడింది కావున పాత ఊరిలో ఉన్న రోడ్లకు విస్తరణ ప్రసక్తే అవసరం లేదని వారన్నారు.