Abn logo
Sep 17 2021 @ 03:20AM

నుస్రత్‌ బిడ్డ తండ్రి యాష్‌ దాస్‌గుప్తా!

కోల్‌కతా, సెప్టెంబరు 16: భర్తతో విడిపోయిన తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చిన బెంగా లీ నటి, టీఎంసీ లోక్‌సభ సభ్యురాలు నుస్రత్‌ జహాన్‌ తన బిడ్డకు యిషాన్‌ అని పేరు పెట్టారు. బాబు పూర్తి పేరు యిషాన్‌ యాష్‌ దాస్‌గుప్తా అని రికార్డుల్లో నమోదు చేయించారు. దీంతో ఆ బాబుకు తండ్రి ఆమె సహ నటుడు, బీజేపీ నేత యాష్‌ దాస్‌గుప్తా అని ఆమె ధ్రువీకరించినట్లయింది. 2019లో నిఖిల్‌ జైన్‌ అనే వ్యాపారవేత్తను టర్కీలో నుస్రత్‌ వివాహమాడారు. మనస్పర్థలు రావడంతో కొన్నాళ్లకే విడిపోయారు. గత ఆగస్టు 26న ఆమెకు మగబిడ్డ కలిగాడు. బిడ్డ తండ్రి పేరు చెప్పేందుకు నిరాకరించారు. తాజాగా ఆ బిడ్డ పేరును రికార్డుల్లో నమోదు చేయించడంతో తండ్రి ఎవరనేది తెలిసిపోయింది.