యుద్ధ ప్రభావం.. చెర్నోబిల్‌లో పెరిగిన అణుధార్మికత

ABN , First Publish Date - 2022-02-25T22:24:19+05:30 IST

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం పరిధిలో అణుధార్మికత పెరిగినట్లు అక్కడి అణుశక్తి నియంత్రణా సంస్థ వెల్లడించింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.

యుద్ధ ప్రభావం.. చెర్నోబిల్‌లో పెరిగిన అణుధార్మికత

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం పరిధిలో అణుధార్మికత పెరిగినట్లు అక్కడి అణుశక్తి నియంత్రణా సంస్థ వెల్లడించింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యా గురువారం అక్కడి చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా చెర్నోబిల్ అణువిద్యుత్ ప్లాంట్ పనిచేయడం లేదు. అయితే ఈ ప్లాంట్‌కు కొన్ని కిలోమీటర్ల పరిధిలో రేడియేషన్ ప్రభావం ఉండటంతో ఈ ప్రాంతాన్ని స్పెషల్ జోన్‌గా పిలుస్తారు. ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు.


ఈ ప్రాంతంలోని గామా రేడియేషన్‌ను నిరంతరం ఉక్రెయిన్ నిపుణులు పరిశీలిస్తుంటారు. శుక్రవారం జరిపిన పరిశీలనలో చెర్నోబిల్ ప్రాంతంలో రేడియేషన్ అధికంగా పెరిగిందని వెల్లడైంది. ఈ ప్రాంతంలో రష్యన్ సైన్యానికి చెందిన వాహనాలు, ఆయుధాలు తిరగడం వల్ల, వాటి నుంచి రేడియో ధార్మికతకు కారణమయ్యే మూలకాలు గాలిలోకి విడుదలవడంతో అణుధార్మికత పెరిగినట్లు అక్కడి ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Updated Date - 2022-02-25T22:24:19+05:30 IST