ఎన్‌టీఆర్‌ కష్టాన్ని చంద్రబాబు లాగేసుకున్నాడు

ABN , First Publish Date - 2021-10-23T03:17:25+05:30 IST

నందమూరి తారక రామారావు కష్టాన్ని నారా చంద్రబాబు నాయుడు లాకున్నాడ ని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు.

ఎన్‌టీఆర్‌ కష్టాన్ని చంద్రబాబు లాగేసుకున్నాడు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

 ఆనం రామనారాయణ రెడ్డి

వెంకటగిరి(టౌన్‌), అక్టోబరు 22: నందమూరి తారక రామారావు కష్టాన్ని నారా చంద్రబాబు నాయుడు లాకున్నాడ ని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక తహసీ ల్దార్‌ కార్యాలయం వద్ద జనాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీని దూషించడం అవమాన కరమన్నారు.  చంద్రబాబు నాయుడు చే స్తున్న దీక్షకు ఆదరణ లేకపోవడంతో ఒ క్కొక్క జిల్లాకు రెండు గంటల సమయం కేటాయించి 36 గంటలు దీక్ష చేస్తున్నా డన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిం చాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరేందుకు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు, గతంలో అలిపిరి వద్ద ఆయనను రాళ్లతో కొట్టించాడని గుర్తు చేశారు.  ఈ కార్య క్రమంలో ఎస్వీబీసీ చైర్మన్‌ సాయికృష్ణ యాచేంద్ర, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నక్కా భానుప్రియ, పద్మశాలి కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ నక్కా వెంకటేశ్వరరావు, జిల్లా సం యుక్త కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, గుమ్మ ళ్లపు డిల్లీబాబు, లక్కమనేని కోటీశ్వరరావు, కౌన్సిలర్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వైసీపీ నాయకులు  పాల్గొన్నారు. 

గూడూరు: స్థానిక టవర్‌క్లాక్‌ కేంద్రం వద్ద శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో జనా గ్రహదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ దీక్షలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛాం ధ్ర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పొణకా దేవ సేన, రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మేరిగ మురళీధర్‌రావు, కోడూరు మీరా రెడ్డి, బొమిడి శ్రీనివాసులు, బత్తిని విజయ కుమార్‌, కొండూరు కోదండరామయ్య, శ్రీధర్‌, రమేష్‌, మగ్దూం, మురళి తదితరు లు పాల్గొన్నారు. చిల్లకూరు    మండలం లోని వరగలిక్రాస్‌రోడ్డు సమీపంలో నిర్వ హించిన దీక్షల్లో జడ్పీటీసీ సభ్యుడు మ న్నెం శీనయ్య, అన్నంరెడ్డి పరంధామ రెడ్డి, ఓడూరు బాలకృష్ణారెడ్డి, యరం వెంకట సుబ్బయ్య, కట్టా రామిరెడ్డి, దువ్వూ రు దిలీప్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి, శ్రీనివాసులు, విష్ణురెడ్డి, సందానీ, హరీష్‌ పాల్గొన్నారు.

కోట: కోటలోని క్రాస్‌రోడ్డులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్‌ ఆధ్వర్యంలో జనాగ్రహదీక్ష నిర్వహించారు. విధంగా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, మండల కన్వీనర్‌ పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, మైనార్టీ సెల్‌ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు షేక్‌ మోబిన్‌బాషా ఆధ్వర్యంలో తహసీల్దా రు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.  వైసీపీ యువజన విభాగం నా యకులు చిల్లకూరు సాయిప్రసాద్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, చెంచురాఘవరెడ్డి, ప్రసాద్‌గౌడ్‌, తదితరు లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T03:17:25+05:30 IST