‘ఉపాధి’లో గోల్‌మాల్‌!

ABN , First Publish Date - 2021-03-03T04:10:20+05:30 IST

ఉపాధి హమీ పనుల్లో గోల్‌మాల్‌ జరిగిట్లు సమాజిక తనిఖీ బహిరంగ వేదికలో వెలుగు చూసింది. దీంతో రూ.13.59 లక్షల రికవరీ చేయాలని అడిషినల్‌ పీడీ సతీ్‌షబాబు ఆదేశించారు.

‘ఉపాధి’లో గోల్‌మాల్‌!
బహిరంగ వేదికలో అడిషన్‌ పీడీ సతీ్‌షబాబు

సమాజిక తనీఖీలో బహిర్గతం

రూ.13.59 లక్షల రికరికీ ఆదేశం

ఏఎస్‌పేట, మార్చి 2: ఉపాధి హమీ పనుల్లో గోల్‌మాల్‌ జరిగిట్లు సమాజిక తనిఖీ బహిరంగ వేదికలో వెలుగు చూసింది. దీంతో రూ.13.59 లక్షల రికవరీ చేయాలని అడిషినల్‌ పీడీ సతీ్‌షబాబు ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సామాజిక తనీఖీ ప్రజావేదిక నిర్వహించారు. అనుమసముద్రం, సీబీవరం, తిమ్మనాయుడుపల్లి, అక్బరాబాదు, హబ్బీపురం, తదితర గ్రామల్లో జరిగిన పనుల్లో అవకతవకలను సామాజిక తనిఖీ బృందం వివరించారు. పలు గ్రామాల్లో మొక్కలు రికార్డుల్లో ఉండడం, పనుల్లో కొలతలు వ్యత్యాసం, కూలీలు తక్కువుగా రావడాన్ని గుర్తించినట్లు వివరించారు. అనంతరం అడిషినల్‌ పీడీ సతీ్‌షబాబు మాట్లడుతూ మండలంలోని 19 పంచాయతీల్లో 2019-20 సంవత్సరంలో సుమారు రూ.6.48 కోట్ల పనులు జరిగాయన్నారు. వివిధ శాఖల పరిధిలో జరిగిన ఈ పనుల్లో రూ.13.59 లక్షల అవకతవకలు జరిగినట్లు గుర్తించి రికవరికీ ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ అధికారి వెంకటేశ్వరావు, తహసీల్దారు లక్ష్మీనరసింహ, ఎంపీడీవో రజినీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T04:10:20+05:30 IST