పిప్పర పీహెచ్‌సీకి అవార్డు

ABN , First Publish Date - 2022-03-02T06:25:24+05:30 IST

పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ నాణ్యత హామీ పురస్కారానికి (ఎన్‌క్యూఏఎస్‌) ఎంపికైంది.

పిప్పర పీహెచ్‌సీకి అవార్డు

గణపవరం, మార్చి 1:  పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ నాణ్యత హామీ పురస్కారానికి (ఎన్‌క్యూఏఎస్‌) ఎంపికైంది. గతేడాది అక్టోబరులో ఆస్పత్రిని తనిఖీ చేసిన కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పురస్కారానికి ఎంపికైందని పిప్పర వైద్యాధికారి అవినాష్‌ తెలిపారు. ఆస్పత్రికి జాతీయ పురస్కారం లభించటం పట్ల మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణర రాజు, ఎంపీపీ దండు వెంకటరామరాజు, జడ్పీటీసీ సభ్యురాలు దేవారపు సోమాలక్ష్మి, పిప్పర సర్పంచ్‌ కాకర బేబీ, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-03-02T06:25:24+05:30 IST