ANDHRA UNIVERSITYలో పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ

ABN , First Publish Date - 2022-07-02T20:58:42+05:30 IST

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ - పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌లు విడుదల చేసింది.

ANDHRA UNIVERSITYలో పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ - పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. 


పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లు

మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఇందులో 40 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌ ఫీజు ఏడాదికి రూ.45,000. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పీజీ డిప్లొమా: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇందులో క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌ టెక్నాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ఒక్కో స్పెషలైజేషన్‌లో 15 సీట్లు ఉన్నా యి. ప్రోగ్రామ్‌ ఫీజు రూ.50,000. ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీఏఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ బీఫార్మసీ/ బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.


  • ఈ ప్రోగ్రామ్‌లకు ఆదిత్య ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలోని బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సహకారం అందిస్తోంది. అకడమిక్‌ మెరిట్‌, కౌన్సెలింగ్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రోగ్రామ్‌నకు సంబంధించిన థియరీ, ప్రాక్టికల్‌  క్లాస్‌లను బొల్లినేని మెడ్‌స్కిల్స్‌, కిమ్స్‌ - ఐకాన్‌ హాస్పిటల్‌ క్యాంప్‌సలో నిర్వహిస్తారు.  ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని నింపి నిర్దేశిత పత్రాలు జతచేసి కింది చిరునామాకు పంపాలి. 


దరఖాస్తు ఫీజు: రూ.500

కౌన్సెలింగ్‌ ఫీజు: రూ.200

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జూలై 31

కౌన్సెలింగ్‌ తేదీ: ఆగస్టు 8 


ఎంబీఏ

ఇది ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలోని స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌  (ఏయూఎస్‌ఐబీ) క్యాంప్‌సలో తరగతులు నిర్వహిస్తారు. మొత్తం 44 సీట్లు ఉన్నాయి. ఏపీఐసెట్‌ 2022 ర్యాంక్‌, కౌన్సెలింగ్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. ఇంకా సీట్లు మిగిలిన పక్షంలో అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. 


ప్రోగ్రామ్‌ ఫీజు: ఏడాదికి రూ.1,50,000

దరఖాస్తు ఫీజు: రూ.2000

కౌన్సెలింగ్‌ ఫీజు: రూ.600

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జూలై 20

కౌన్సెలింగ్‌ తేదీ: జూలై 22


చిరునామా: డైరెక్టర్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, ఆంధ్ర యూనివర్సిటీ, 

విజయనగర్‌ ప్యాలెస్‌, పెద వాల్తేర్‌, విశాఖపట్నం - 530017

వెబ్‌సైట్‌: www.audoa.in

Updated Date - 2022-07-02T20:58:42+05:30 IST