అక్టోబరు రెండోవారంలో నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-09-29T05:47:31+05:30 IST

ఎడాపెడా నేతల కొనుగోళ్లు, ఎక్కడికక్కడ ప్రభుత్వ పదవుల పంపకాలు, దళితబంధు, గొర్రెలపంపిణీ వంటి హంగామాలకు దూరం గా ఓటు బ్యాంకే లక్ష్యంగా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది.

అక్టోబరు రెండోవారంలో నోటిఫికేషన్‌
చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెంలో చేనేత కార్మికులతో భోజనం చేస్తున్న టీఆర్‌ఎస్‌ నేత శివశంకర్‌

టీఆర్‌ఎస్‌ శ్రేణులకు సీఎం కేసీఆర్‌ సంకేతం 

నేతన్నలతో ఆత్మీయ సమ్మేళనం

24వేల ఓటు బ్యాంకు టార్గెట్‌ 

దసరా తర్వాత గట్టుప్పల్‌లో భారీ సభ 



(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): ఎడాపెడా నేతల కొనుగోళ్లు, ఎక్కడికక్కడ ప్రభుత్వ పదవుల పంపకాలు, దళితబంధు, గొర్రెలపంపిణీ వంటి హంగామాలకు దూరం గా ఓటు బ్యాంకే లక్ష్యంగా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఎప్పుడు? ఎవరు? ఏ కార్యక్రమం చేపట్టాలో అధిష్ఠానం నుంచే స్పష్టమైన సం కేతాలు అందుతున్నాయి. రాష్ట్రంలోని బడానేతలకు ఎన్నికల విధులు అప్పగించినా వారిని నియోజకవర్గానికి దూరంగానే పెట్టారు. అభ్యర్థిగా కూసుకుంట్లను ప్రకటించకపోయినా ఆయన్నే ముందు పెట్టి నడిపిస్తున్నారు.



విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి ఎలాంటి హడావిడి లేకుండా జిల్లా ఎమ్మెల్యేలతో నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్నవర్గాలను ఆప్యాయంగా పలకరించి, విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మనమంతా కుటుంబ సభ్యులం, మన పెద్ద కేసీఆరే అన్న సందేశాన్ని తీసుకెళుతున్నారు. అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న దళితులు, గిరిజనుల ఆత్మీయ సమ్మేళనాలు ముగియగా తాజాగా చేనేతల సమ్మేళనానికి తెర లేపారు. అక్టోబరు 8కి అటుఇటుగా నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఈ లోపే సమ్మేళనాలు ముగించాలని గులాబీబాస్‌ ఆదేశించడంతో టీఆర్‌ఎస్‌ నేతలు వరుస కార్యక్రమాలు చేపట్టారు. 


చేనేత కార్మికుల ఓట్ల కోసం  

మునుగోడు నియోజకవర్గంలో సుమారు 2.20లక్షల ఓ ట్లుండగా ఇందులో అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్నది గౌ డ, చేనేత, ముదిరాజ్‌, దళితులే. సుమారు 24వేల ఓటు బ్యాంకు కలిగిన చేనేత కార్మికులపై టీఆర్‌ఎస్‌ పెద్దలు దృష్టిసారించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థాన్‌నారాయణపురం టీఆర్‌ఎస్‌ మాజీ జడ్పీటీసీ, అఖిల భారత పద్మశాలీ రాజకీ య విభాగం అధ్యక్షుడు బొల్ల శివశంకర్‌కు అప్పగించారు. చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, చండూరు, మునుగో డు మండలాల్లో పద్మశాలీలు అధికంగా ఉన్నారు. మర్రిగూ డ, నాంపల్లి మండలాల్లో వీరి సంఖ్య కొంత తక్కువగా ఉం టుంది. ఈ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు నియోజకవ ర్గం మొత్తంలో 15 గ్రామాల్లోనే అత్యధికంగా ఉన్నారు. పద్మశాలీలు అధికంగా ఉన్న మండలాల్లో మూడు రోజులపాటు అదే సామాజిక వర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేతలతో ఇంటింటికీ తిరుగుతున్నారు.నూలు, రంగులు, రసాయనాల పై కేంద్రంలోని బీజేపీ 18శాతం జీఎస్టీ విధించడం మూ లంగా చేనేత కార్మికులకు ఉపాధి కరువు అవుతోంది. ప్రభు త్వం పేదలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు చేనేత కార్మికులు పొందడంలో ఏమైన ఇబ్బందులు పడుతున్నా రా? అయితే ఆ సమస్యలు మేం పరిష్కరిస్తామంటూ ప్రచా రం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేనేత కార్మికుల సం క్షేమంకోసం చేపడుతున్న పథకాలను వివరిస్తున్నారు. జీరో జీఎస్టీ పేరుతో గడపగడపకు ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ తీసుకుంది. చేనేత సామాజికవర్గానికి చెందిన పెద్దలు, స్థానిక నేతలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. 


రోజుకో గ్రామం.. విందు భోజనంతో ఆత్మీయ సమ్మేళనం 

రోజుకు ఒక గ్రామం చొప్పున పర్యటించి మూడు రోజుల తదుపరి మండలకేంద్రంలో విందు భోజనంతో ఆత్మీయ సమ్మేళనంఏర్పాటు చేయనున్నారు. ఇలా మండలాలవారీగా ఈ నెల 3వ తేదీ లోపు సమ్మేళనాలు పూర్తిచేసి దసరా పండుగ వెళ్లిన ఒకటి, రెండు రోజుల్లో గట్టుప్పల్‌లో 10వేల మంది చేనేత కార్మికులతో భారీ సభ నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందుకయ్యే ఖర్చు మొత్తం అధికార పార్టీనే భరిస్తోంది. ‘అక్టోబరు 8కి అటు ఇటుగా నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఒకసారి నోటిఫికేషన్‌ వెలువడితే భారీ వ్యయంతో వేలమందిని ఒకదగ్గరికి చేర్చి ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు ముందుకు తీసుకెళ్లడం కుదరదు. అంతా అభ్యర్థి ఖర్చులోకి నమోదవుతుంది. ఈనేపథ్యంలో ఇలాంటి భారీ విందులు, సమావేశాలు అక్టోబరు మొదటి వా రంలోనే పూర్తి చేసుకోవాలి’ అంటూ టీఆర్‌ఎస్‌ పెద్దలు సూచించడంతో సామాజిక వర్గాలవారీగా ఓట్లవేట వేగవంతమైంది. ఇప్పటికే నియోజకవర్గంలో దళిత, గిరిజన, సామాజి క వర్గాల వేట చివరి దశకు చేరగా తాజాగా చేనేత సమ్మేళనాలు తెరపైకి వచ్చాయి. 

Updated Date - 2022-09-29T05:47:31+05:30 IST