మహిళా, శిశు సంక్షేమ శాఖ పోస్టులకు నోటిఫికేషన

ABN , First Publish Date - 2022-05-19T05:14:30+05:30 IST

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీపీఎస్‌, ఒన స్టాఫ్‌ సెంటర్‌ (సఖీ)లో నాలుగు కాంట్రాక్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన జారీ చేసినట్లు జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి మహిళా సాధికారిత అధికారి కేఎల్‌ఆర్‌కే కుమారి ఓ ప్రకటనలో తెలిపారు.

మహిళా, శిశు సంక్షేమ శాఖ పోస్టులకు నోటిఫికేషన


కర్నూలు(హాస్పిటల్‌), మే 18: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీపీఎస్‌, ఒన స్టాఫ్‌ సెంటర్‌ (సఖీ)లో నాలుగు కాంట్రాక్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన జారీ చేసినట్లు జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి మహిళా సాధికారిత అధికారి కేఎల్‌ఆర్‌కే కుమారి ఓ ప్రకటనలో తెలిపారు. పారా మెడికల్‌ పర్సనల్‌ పోస్టులు మూడు ఉన్నాయని, వీటికి దరఖాస్తు చేసుకొనేవారికి 18 నుంచి 39 సంవత్సరాలు ఉండాలని అన్నారు.  ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి ఐదేళ్ల సడలింపు ఉంటుందన్నారు. కేసు వర్కర్‌ పోస్టు ఒక్కటి ఉంటుందని, దీనికి దరఖాస్తు చేసుకుంటున్నవారికి 39 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలని అన్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలోపు కర్నూలు ఐసీడీఎస్‌ కార్యాలయంలో అదనపు పథక సంచాలకులుకు దరఖాస్తులను సమర్పించాలన్నారు.  వివరాలకు కర్నూలు వెబ్‌సైట్‌ ఏ్ట్టఞ://జుఠటుఽౌౌజూ.్చఞ.జౌఠి.జీుఽ ను సంప్రదించాలన్నారు.


Updated Date - 2022-05-19T05:14:30+05:30 IST