తగ్గుముఖం..

ABN , First Publish Date - 2020-03-28T10:46:12+05:30 IST

వైద్యఆరోగ్యశాఖ అధికారులకు శుక్రవారం కాస్తంత ఊరట కలిగించే విషయం. శుక్రవారం జిల్లాలో ఎక్కడా అనుమానిత

తగ్గుముఖం..

ఒక్క అనుమానిత కేసూ నమోదు కాని వైనం

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి నోటీసులు

ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు


 ఒంగోలు నగరం, మార్చి 27: వైద్యఆరోగ్యశాఖ అధికారులకు శుక్రవారం కాస్తంత ఊరట కలిగించే విషయం. శుక్రవారం జిల్లాలో ఎక్కడా అనుమానిత కేసు వెలుగు చూడలేదు. కిందిస్థాయి ఏఎన్‌ఎం నుంచి కలెక్టర్‌ వరకు కరోనా కట్టడిపైనే రోజంతా దృష్టి సారించి పనిచేస్తున్నారు. వైద్యఆరోగ్యశాఖ అధికారులు వైద్య సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నారు. కాగా శుక్రవారం రిమ్స్‌లో చికిత్సపొందుతున్న మరో ఇద్దరి అనుమానితులకు చెందిన నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి.


ఒంగోలుకు చెందిన వ్యక్తిది, మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వ్యక్తికి చెందిన ఫలితాలు రెండూ నెగటివ్‌గా వచ్చాయి. మరో ఐదుగురి ఫలితాలు శనివారం ఉదయం వెలువడే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి సచివాలయం సిబ్బంది, వైద్యఆరోగ్యశాఖ, పోలీసులు గ్రామాల్లో జల్లెడ పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఈ రెండు మూడు రోజుల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే కలెక్టర్‌ శుక వ్రారం ఒంగోలులోని సంఘమిత్ర, కిమ్స్‌ వైద్యులతో సమావేశం అయ్యారు.వెంటనే ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేయాలని కోరారు. 

Updated Date - 2020-03-28T10:46:12+05:30 IST