చెరువు కాదు

ABN , First Publish Date - 2021-12-02T05:41:18+05:30 IST

నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో భారీగా వర్షపు నీరు నిలిచింది. అధికారులు పట్టించుకోపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

చెరువు కాదు

నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో భారీగా వర్షపు నీరు నిలిచింది. అధికారులు పట్టించుకోపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బురద నీటిలో నడుచుకుంటూ తరగతి గదుల్లోకి వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసిన రోజున కాలేజీకి రావాలంటే భయంగా ఉందని వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతు న్నారు. కళాశాలలో గుంతలు ఏర్పడి నీరు నిల్వ ఉండటానికి కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ఆది డిమాండ్‌ చేశారు. అదనపు గదుల నిర్మాణం కోసం భారీ వాహనాలు కాలేజీ ప్రాంగణంలోకి రావడంతో గుంతలు ఏర్పడి నీరు నిలుస్తోందని ఆరోపించారు. సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్‌ రాజశేఖర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్‌, శివ, షాహిద్‌, జబీవుల్లా పాల్గొన్నారు.              

                        - నందికొట్కూరు

Updated Date - 2021-12-02T05:41:18+05:30 IST