Advertisement
Advertisement
Abn logo
Advertisement

మాంసాహారం ముట్టడు... ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి(25-12-2020)

ప్రశ్న: మా బాబుకు ఏడేళ్లు. మాంసాహారం ముట్టడు. ప్రత్యామ్నాయంగా శాకాహారంలో ఎలాంటి ఆహారపదార్థాలు తినిపించాలో చెబుతారా?


- లక్ష్మీకాంత్‌, కర్నూలు


డాక్టర్ సమాధానం: ప్రతిపూటా బాబు తీసుకునే ఆహారం సమతుల్యమైనదైతే శాకాహారమైనా, మాంసాహారమైనా తగిన పోషకాలు సమృద్ధిగానే లభిస్తాయి. కాబట్టి అంతగా విచారించాల్సిన అవసరంలేదు. మాంసాహారం ద్వారా మనకు ముఖ్యంగా లభించే పోషకాలు- ప్రొటీన్లు, ఐరన్‌, కాల్షియం, కొన్ని రకాల విటమిన్లు. ఈ పోషకాల్లో చాలా వాటిని శాకాహారం నుండి కూడా పొందేలా చేయవచ్చు. ప్రొటీన్ల కోసం కంది, పెసర లాంటి పప్పులు; సెనగలు, అలసందలు, రాజ్మా, సోయా చిక్కుడు లాంటి గింజలు; పాలు, సోయా పాలు, పన్నీర్‌, పెరుగు, సోయా పన్నీర్‌ లాంటివి తీసుకుంటే సరిపోతుంది. రోజూ తప్పనిసరిగా ఆకుకూరలు తీసుకోవడం వల్ల కొంత వరకు ఐరన్‌, కాల్షియం లభిస్తుంది. శాకాహారంలో ముఖ్యంగా బి-12 విటమిన్‌ తక్కువగా ఉండే అవకాశం ఉంది. బి -12 కోసం పాలు, పెరుగుల పై ఆధారపడవచ్చు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరుగుతూ ఆరోగ్య సమస్యలేమీ లేనట్టయితే మీ బాబుకు పోషకాలు సరిగా అందుతున్నట్టే.  


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

[email protected] కు పంపవచ్చు)


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...