సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం : భాస్కర్‌రావు

ABN , First Publish Date - 2022-05-18T06:25:50+05:30 IST

కరో నా లాంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా సీఎం కే సీఆర్‌ అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే భా స్కర్‌రావు అన్నారు.

సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం : భాస్కర్‌రావు
దామరచర్లలో చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు

అడవిదేవులపల్లి, దామరచర్ల, వేములపల్లి, మే 17: కరో నా లాంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా సీఎం కే సీఆర్‌ అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే భా స్కర్‌రావు అన్నారు. మంగళవారం అడవిదేవులపల్లి మండలానికి చెందిన 84 మంది, దామరచర్ల 179, వేములపల్లి 61, మాడ్గులపల్లి మండలానికి చెందిన 44 మంది మొత్తం  చెందిన 368 మంది ల బ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు. పేదింటి ఆడపిల్లలకు వివాహ సమయంలో ఇ బ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆయా కా ర్యక్రమాల్లో ఎంపీపీలు బాలాజీనాయక్‌, ధీరావత నందిని రవితేజ, ఎంపీపీ పుట్టల సునీత, జడ్పీటీసీలు  సేవ్యానాయక్‌, ఆంగోతు లలి త హాతిరాంనాయక్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన నారాయణరెడ్డి, జిల్లా కోఆప్షన సభ్యుడు మోసినఅలీ, వైస్‌ ఎంపీపీ పాదూరి గోవర్ధని, మాజీ ఎంపీపీ కూరాకుల మంగమ్మ చినరామయ్య, సర్పంచుల ఫో రం అధ్యక్షుడు కొత్త మర్రెడ్డి, తహసీల్దార్లు మౌలానా, రాజు, వెంకటేశం, అర్చన, ఎంపీడీవోలు అహ్మద్‌షరీఫ్‌, కృష్ణమూర్తి, నాయకులు కుర్ర శ్రీనునాయక్‌, కుందూరు వీరకోటిరెడ్డి, ఆర్‌ఐ సతీష్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 




Updated Date - 2022-05-18T06:25:50+05:30 IST