జగన్‌ పాలనలో నాణ్యతలేని రోడ్లు

ABN , First Publish Date - 2020-12-06T04:51:40+05:30 IST

జగన్‌ పాలనలో రోడ్లనిర్మాణాలు నాణ్యత లేకుండా జరిగాయని దీంతో వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని వాహనదారులు రోడ్లపై ప్రయాణించా లంటే హడలిపోతున్నారని బీజేపీ జల్లా అధ్యక్షుడు కర్నాటి యల్ల్లారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్‌ గొర్రె శ్రీనివాసులు విమర్శించారు.

జగన్‌ పాలనలో నాణ్యతలేని రోడ్లు
ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలు

ప్రొద్దుటూరు అర్బన్‌, డిసెంబరు 5 : జగన్‌ పాలనలో రోడ్లనిర్మాణాలు నాణ్యత లేకుండా జరిగాయని దీంతో వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని వాహనదారులు రోడ్లపై ప్రయాణించా లంటే హడలిపోతున్నారని బీజేపీ జల్లా అధ్యక్షుడు కర్నాటి యల్ల్లారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్‌ గొర్రె శ్రీనివాసులు విమర్శించారు. శనివారం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వర్షాలకు దెబ్బతిన్న  రోడ్లకు మరమ్మతులు చేపట్టాలనే డిమాండ్‌తో తహసీల్దారు కార్యాల యం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్టో 1.92 లక్షల కిలో మీటర్లు రోడ్ల నిర్మాణానికి నిధులు ఇస్తే జగన్‌ ప్రభుత్వం అనధికార లేఅవుట్‌లకు రోడ్లు నిర్మిస్తు గ్రామీణ రోడ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్షం ప్రదర్శిస్తోందని దుయ్యబట్డారు. మండలంలోని చౌడురు, దొరసానిపలె,్ల తాళ్ళమాపురం, కాకిరేనిపల్లె, కల్లూరు, సోములవారిపల్లె రోడ్లు  అధ్వానంగా వున్నాయన్నారు. బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి నివేదికలు తయారు చేసి మండలాల వారీగా అధికారుల దృష్టికి తీసుకెళతారన్నారు. అంతకు ముందు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లకు  49 సీట్లు సాధించి తన ప్రభావాన్ని చాటిం దని రాజీవ్‌సర్కిల్లో బిజెపి కార్యకర్తలు టపాసులు పెల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారు మనోహర్‌రెడ్డికి వారొక వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో  పట్టణ అద్యక్షుడు సుబ్రమణ్యం, కార్యదర్శి ఆంజినేయులు, భాస్కర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, క్రిష్ణ, సుబ్బరాజు, రమణ,రాజు, సుధాకర్‌, నాగబ్రహ్మం, నరసింహులు, నరేష్‌,సురేష్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2020-12-06T04:51:40+05:30 IST