Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘సద్దుల’ సందడి

 జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సందడి

(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌)

సద్దుల బతుకమ్మ వేడుకలను గురువారం మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నల్లగొండలోని రామగిరి రామాలయం వద్ద నిర్వహించిన వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరిలి వచ్చారు. అందంగా, కళాత్మకంగా పేర్చి తీసుకువచ్చిన బతుకమ్మలను గుర్తించి, ఆలయ చైర్మన్‌ చకిలం వేణుగోపాల్‌రావు బహుమతులు అందజేశారు.  వీటీ కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయం, తులసీనగర్‌ శ్రీభక్తాంజనేయ స్వామి అలయం, శేర్‌ బంగ్లాలోని సంతోషిమాత దేవాలయం, బీట్‌ మార్కెట్‌ శ్రీరామకోటి స్తూపదేవాలయం, పానగల్లు పచ్చల, ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాలతో పాటు పట్టణప్రధాన కూడళ్లు, అపార్టుమెంట్లలోసద్దుల బతుకమ్మ వేడుకలు చూడముచ్చటగా సాగాయి. కనగల్‌, తిప్పర్తి మండలాల్లో వేడుకలు వైభవంగా నిర్వహించారు. హాలియాలో నిర్వమించిన బతుకమ్మ వేడుకలో ఎమ్మెల్యే నోముల భగత్‌ పాల్గొన్నారు.  తిరుమలగిరి(సాగర్‌), పెద్దవూర, నిడమనూరు, త్రిపురారం, నాగార్జునసాగర్‌ మండలాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. దేవరకొండ నియోజకవర్గంలోని దేవర కొండ, కొండమల్లేపల్లి, పెద్దఅడిశర్లపల్లి, చింతపల్లి, నేరేడుగొమ్ము, చందంపేట మండలాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో వేడుకలు జోరుగా సాగాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన వేడుకలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు పాల్గొన్నారు. వేములపల్లి, మాడ్గులపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో వేడుకలు సాగాయి. నకిరేకల్‌ నియోజకవర్గంలోని నకిరేకల్‌, నార్కట్‌పల్లి, చిట్యాల, కట్టంగూరు, కేతేపల్లి మండలాల్లో ఊరూ వాడా  వేడుకగా పండుగ నిర్వహించారు.  శాలిగౌరారం మండలంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. 


Advertisement
Advertisement