నోయిడాలో క్వారంటైన్ కు 200 మంది

ABN , First Publish Date - 2020-04-08T11:58:32+05:30 IST

కరోనా వైరస్ విపత్తు ఉత్తరప్రదేశ్ లోని నోయిడాను గజగజలాడిస్తోంది. నోయిడాలోని సెక్టార్ 8, సెక్టార్ 5 లో నివసిస్తున్న సుమారు 200 మందికి క్వారంటైన్ నిర్దేశించారు. వీరిలో ఎవరికీ కరోనా ఇన్ఫెక్షన్....

నోయిడాలో క్వారంటైన్ కు 200 మంది

నోయిడా: కరోనా వైరస్ విపత్తు ఉత్తరప్రదేశ్ లోని నోయిడాను గజగజలాడిస్తోంది. నోయిడాలోని సెక్టార్ 8, సెక్టార్ 5 లో నివసిస్తున్న సుమారు 200 మందికి క్వారంటైన్ నిర్దేశించారు. వీరిలో ఎవరికీ కరోనా ఇన్ఫెక్షన్ నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. అయితే  కరోనా సోకిన వ్యక్తులతో సంబంధాలు ఉన్న కారణంగా ఈ చర్య తీసుకున్నామన్నారు. గౌతమ్ బుద్ధ నగర్ డిసిపి సంకల్ప్ శర్మ మాట్లాడుతూ హరోలాలో నివసిస్తున్నవారితో పాటు సెక్టార్ 5, సెక్టార్ 8 లోనివారికి  కరోనా వైరస్ నిర్ధారణ కాలేదన్నారు. అయితే  తబ్లిగి జమాత్ సభ్యులతో కొందరికి పరిచయాలున్నాయన్నారు. అందుకే వారిని క్వారంటైన్ లో ఉంచామన్నారు. 

Updated Date - 2020-04-08T11:58:32+05:30 IST