కశ్మీరులో 48 గంటల్లో నాలుగు ఎన్‌కౌంటర్‌లు

ABN , First Publish Date - 2021-07-09T13:21:23+05:30 IST

జమ్మూకశ్మీరులో శుక్రవారం తెల్లవారుజామున మరోసారి ఉగ్రవాదులు, సైనికులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభం అయింది....

కశ్మీరులో 48 గంటల్లో నాలుగు ఎన్‌కౌంటర్‌లు

 కుల్గాంలో మళ్లీ ఎన్‌కౌంటర్ ప్రారంభం

కుల్గాం(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులో శుక్రవారం తెల్లవారుజామున మరోసారి ఉగ్రవాదులు, సైనికులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభం అయింది.దీంతో కేవలం 48 గంటల్లో కశ్మీరులో నాలుగు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. దక్షిణ కశ్మీరులోని కుల్గాం జిల్లా రెడ్‌వానీ గ్రామంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్ పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ చేపట్టాయి.రెడ్‌వానీ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు.ఉగ్రవాదులు, ఆర్మీజవాన్ల మధ్య ఎదురుకాల్పులు సాగుతూనే ఉన్నాయి. జమ్మూకశ్మీరులో గత 48 గంటల్లో కుల్గాంలో జరుగుతున్న ఎన్ కౌంటర్ నాల్గవది. అంతకుముందు మూడు ఎన్ కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, తుపాకులను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. 


Updated Date - 2021-07-09T13:21:23+05:30 IST