గంగానది నీటిలో కరోనా వైరస్ జాడ లేదు...అధ్యయనంలో వెల్లడి

ABN , First Publish Date - 2021-07-08T14:15:09+05:30 IST

గంగా నది నీటిలో కరోనా వైరస్ జాడ లేదని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అధ్యయనంలో తాజాగా...

గంగానది నీటిలో కరోనా వైరస్ జాడ లేదు...అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ : గంగా నది నీటిలో కరోనా వైరస్ జాడ లేదని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని గంగానది తీరప్రాంత జిల్లాల్లో కరోనా మృతదేహాలను నదిలోకి వదిలారు. దీంతో కన్నూజ్, ఉన్నవో, కాన్పూర్, హమీర్‌పూర్, అలహాబాద్, వారణాసి, బాలియా, బక్సర్, ఘాజిపూర్, పాట్నా, ఛప్రా ప్రాంతాల్లోని గంగా నది నుంచి నీటి నమూనాలను తీసుకొని రెండు దశల్లో ఈ అధ్యయనం నిర్వహించారు.గంగా నదిలో నుంచి సేకరించిన నీటి నమూనాల్లో సార్స్ కొవిడ్ జాడ లేదని ఈ అధ్యయనంలో వెల్లడైంది.


నీటి నమూనాల నుంచి వైరస్ యొక్క ఆర్ఎన్ఏను సేకరించి వైరోలాజికల్ పరీక్ష చేయగా ఎలాంటి కరోనా ఆనవాళ్లు లేదని తేలింది.కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (ఐఐటిఆర్), లక్నో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి,రాష్ట్ర కాలుష్య నియంత్రణ నియంత్రణ మండలి సహకారంతో జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. కరోనా మృతదేహాలను గంగా నదిలో పడేసినా నది నీటిలో మాత్రం కరోనా వైరస్ జాడ లేదని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.

Updated Date - 2021-07-08T14:15:09+05:30 IST