Abn logo
Jul 16 2020 @ 09:54AM

పైలట్, బీజేపీ మధ్య చర్చలు జరగలేదు : గజేంద్ర సింగ్ షెకావత్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌, బీజేపీ మధ్య చర్చలు జరగలేదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. బీజేపీలో చేరడం లేదంటూ స్వయంగా పైలెట్ వెల్లడించారని, ఇంకా చర్చలెక్కడుంటాయని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పదవీ కాలం ఎప్పుడు పూర్తవుతుందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఆయన ఎన్ని రోజులు పదవిలో ఉంటారన్నది కాలమే సమాధానం చెబుతుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరితే సంతోషమే అన్నంత మాత్రాన బీజేపీలోకి ఎవరో వస్తున్నారన్నది అర్థం కాదని షెకావత్ స్పష్టం చేశారు. 


Advertisement
Advertisement
Advertisement