Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్రిస్మ్‌సకీ తీపి లేదు

పంచదార, కందిపప్పు కోటా కట్‌చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 3: క్రిస్మస్‌ పండక్కి కూడా రేషన్‌ చక్కెర, కందిపప్పులో కోటాలో కోత పండింది. గతంలో పండగలకి అదనపు కోటా ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం అదనపుకోటా ఇవ్వడం లేదు. పైగా ఇచ్చే కోటాలోనూ కోత పెడుతోంది. దీపావళి పండగ నెలలోనూ కోత పెట్టిన ప్రభుత్వం క్రిస్మస్‌, న్యూఇయర్‌ డేలకి కూడా పేదలకు చేదు మిగులుస్తోంది. జిల్లాలో 11.47 లక్షల బియ్యం కార్డులున్నాయి. నెలకు 600 టన్నుల పంచదార కావాల్సివుండగా అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో 250 టన్నులను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. అలాగే 1100 టన్నుల కందిపప్పు కావాల్సివుండగా డిసెంబరు నెలలో 400 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంచింది.  

Advertisement
Advertisement