ఇళ్లలోని మహిళలకే భద్రత లేదు

ABN , First Publish Date - 2022-05-20T05:17:17+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇళ్లలోని మహిళలకు, ఆడబిడ్డలకు కూడా భద్రత లేకుండా పోయిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.

ఇళ్లలోని మహిళలకే భద్రత లేదు
కావ్యకు నివాళి అనంతరం ఆమె తండ్రితో మాట్లాడుతున్న సోమిరెడ్డి

 మాజీ మంత్రి సోమిరెడ్డి

పొదలకూరు, మే 19 : వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇళ్లలోని మహిళలకు, ఆడబిడ్డలకు కూడా భద్రత లేకుండా పోయిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఉన్మాది చేతిలో మృతి చెందిన కావ్య నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి నివాళులర్పించి ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లోని పడక గదిలో ఆఫీసు వర్క్‌ చేసుకుంటున్న కావ్యను అదే గ్రామానికి చెందిన వ్యక్తి తుపాకీతో కాల్చడం దుర్మార్గమన్నారు.  కావ్య కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం చేసి భరోసా ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.  పచ్చని పల్లెల్లో తుపాకీ సంస్కృతి వచ్చిందంటే రాష్ట్రంలో శాంతిభద్రలు ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చన్నారు. వైసీపీ అఽధికారంలోకి వచ్చాక 800 సంఘటనల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందన్నారు.  ముఖ్యమంత్రి జగన్‌ జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మస్తాన్‌బాబు, బక్కయ్య నాయుడు, పి.కృష్ణ, సుధాకర్‌రెడ్డి, తాటిపర్తి టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T05:17:17+05:30 IST