Abn logo
Jun 30 2020 @ 04:55AM

ముందస్తు జాగ్రత్త చర్యలేవి?

కీసర రూరల్‌: కరోనా కేసులు పెరుగుతున్నా నాగారం మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవటం లేదని మేడ్చల్‌ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కందాడి సత్తిరెడ్డి ఆరోపించారు. సోమవారం నాగారం మున్సిపాలిటీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీలోని పలు కాలనీలో కారోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాజిటివ్‌ పేషంట్లను ఇంట్లోనే ఉంచి చికిత్స అందించటం ఎంత వరకు సమంజసమన్నారు. వైద్యాధికారులు, మున్సిపల్‌ అధికారులు ప్రజలను చైతన్య పరచటంలో విఫలమయ్యారని విమర్శించారు. సమావేశంలో సురేష్‌, జూపల్లి నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.


కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

మేడ్చల్‌ అర్బన్‌: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు అన్నారు. సోమవారం ముఖ్య నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ కేంద్రం రూ.7,500 కోట్ల కరోనా సహాయం చేసినా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. సకాలంలో వైద్యం అందించకపోవడంతో రోజూ మరణాలు జరుగుతున్నాయని చెప్పారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement