బెంగళూరు: ఈనెల 31వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ ఎత్తివేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో కోవిడ్‌పై శనివారంనాడు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. అలాగే సోమవారం నుంచి 1-9 వరకూ ఫిజికల్ క్లాసెస్ తిరిగి ప్రారంభించేందుకు స్కూళ్లను అనుమతించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. సినిమా థియేటర్లు మినహా హోటళ్లు, బార్లు, పబ్‌లు 50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతించనున్నారు. పెళ్లిళ్లకు 300 మంది వరకూ అనుమతిస్తారు. మహారాష్ట్ర, గోవా, కేరళ నుంచి కర్ణాటక వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి