కంప్యూటర్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు: కేంద్రం

ABN , First Publish Date - 2020-04-04T22:00:47+05:30 IST

కాగా లైట్లు ఆపేయాలన్న మోదీ పిలుపుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కరోనా వైరస్ నివారణకు చర్యలు తీసుకోవడం మానేసి వేరే పనులు చేస్తున్నారని విమర్శలు గుప్పించాయి. తాను కరోనాతో పోరాడుతానని

కంప్యూటర్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: రేపు రాత్రి 9 గంటలకు ఇంట్లోని అన్ని లైట్లు బంద్ చేసి 9 నిమిషాల పాటు కొవ్వొత్తుల వెలుగులతో గడపాలని ప్రధాన నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం లైట్లు మాత్రమే ఆపేయాలని కంప్యూటర్లు, ఫ్యాన్లు, ఏసీలు లాంటివి ఆపేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం తొమ్మిది నిమిషా పాటే లైట్లు ఆపేయాలని ఆ తర్వాత యదాథతంగా కొనసాగించుకోవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.


కాగా లైట్లు ఆపేయాలన్న మోదీ పిలుపుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కరోనా వైరస్ నివారణకు చర్యలు తీసుకోవడం మానేసి వేరే పనులు చేస్తున్నారని విమర్శలు గుప్పించాయి. తాను కరోనాతో పోరాడుతానని, అయితే లైట్లు ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేయనని లోక్‌సభా కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి అన్నారు.

Updated Date - 2020-04-04T22:00:47+05:30 IST