సచివాలయాల్లోనే ఇక భూరిజిస్ర్టేషన్‌

ABN , First Publish Date - 2022-01-19T04:46:02+05:30 IST

భూవివాదాలు, రిజిస్ర్టేషన్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకే రాష్ట్ర ప్రభు త్వం గ్రామ సచివాలయాల్లో భూముల, ఆస్తుల రిజిస్ర్టేషన్‌ ప్ర క్రియలను అమలులోకి తీసుకువచ్చిందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌బాషా తెలిపారు.

సచివాలయాల్లోనే ఇక భూరిజిస్ర్టేషన్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి, కలెక్టర్‌

సచివాలయ కార్యదర్శులే సబ్‌ రిజిస్ర్టార్‌లు 

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా

పెండ్లిమర్రి / పులివెందుల టౌన్‌ /పుల్లంపే ట, జనవరి 18: భూవివాదాలు, రిజిస్ర్టేషన్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకే రాష్ట్ర ప్రభు త్వం గ్రామ సచివాలయాల్లో భూముల, ఆస్తుల రిజిస్ర్టేషన్‌ ప్ర క్రియలను అమలులోకి తీసుకువచ్చిందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌బాషా తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి స్థానిక గ్రామ సచివాలయంలోనే స్థిరాస్తుల రిజిస్ర్టేషన్‌ సేవలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. రీసర్వే పూర్తయిన పెండ్లిమర్రి మండలం ఎస్‌.రామాపురంలో భూరిజిస్ర్టేషన్ల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భూములు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన వైఎ్‌సఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంలో భాగంగా రాష్ట్రంలో 37 రెవెన్యూ గ్రామాల పరిధిలో రీసర్వే పూర్తి చేశారన్నారు. ఈ రీసర్వే గ్రామాల పరిధిలో సచివాలయాల్లోనే రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనే భూ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియలను అమలు చేయడం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి, ఎస్డీసీ శాంతమ్మ, సర్వేలాండ్స్‌ రికార్డ్‌ ఏడీ జయరాజ్‌, తహసీల్దార్‌ ఉదయభాస్కర్‌రాజు, ఎంపీడీవో రమణారెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలయ్య, సర్పంచ్‌ బాబాబీ, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.  యు.సలివెందులలో రీసర్వే పూర్తి కావడంతో జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకాన్ని సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ రైతులతో కలిసి పి.వి.జి.పల్లె సచివాలయంలో పాల్గొన్నారు.

రాగిమానుపల్లె సచివాలయంలో...

రాగిమానుపల్లె సచివాలయంలో భూరిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభించినట్లు ఆర్డీఓ శ్రీని వాసులు తెలిపారు. రాగిమానుపల్లె సచివాలయంలో ముఖ్యమంత్రి సందేశాన్ని లైవ్‌ ద్వారా అధికారులు, నేతలు తిలకించారు. రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టులో 37 గ్రామాల్లో రీసర్వే పూర్తయిన భూములకు గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను ప్రారంభించారని, అందులో రాగిమానుపల్లె సచివాలయం ఒకటన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మాధవ కృష్ణారెడ్డి, సర్వేయర్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T04:46:02+05:30 IST