భూములివ్వం

ABN , First Publish Date - 2022-01-26T06:04:10+05:30 IST

అదనపు టీఎంసీ కాలువ నిర్మాణానికి భూములివ్వమని రైతులు గ్రామ సభను బహిష్కరించి నిరసనను తెలిపారు.

భూములివ్వం
అడిషనల్‌ కలెక్టర్‌ను అడ్డుకుంటున్న రైతులు

- అసిస్టెంట్‌ కలెక్టర్‌ను అడ్డుకున్న ముంపు రైతులు

గంగాధర, జనవరి 25: అదనపు టీఎంసీ కాలువ నిర్మాణానికి భూములివ్వమని రైతులు గ్రామ సభను బహిష్కరించి నిరసనను తెలిపారు. మంగళవారం గంగాధర మండలం కొండన్నపల్లిలో ముంపు బాధితులతో నిర్వహించనున్న గ్రామ సభకు అధనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ లాల్‌, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ వస్తున్నారని తెలుసుకుని గ్రామంలో వారి వాహనాన్ని రైతులు అడ్డుకుని నిరసన తెలిపారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని రైతులకు తెలుపగా గ్రామసభ నిర్వహించేందుకు ఒప్పుకున్నారు. ఇప్పటికే వరద కాలువ, గ్రావిటీ కాలువలో భూములు కోల్పోయామని, మళ్లీ భూములు తీసుకోవద్దని రైతులు అధికారులకు విన్నవించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ అశోక్‌  పాల్గొన్నారు.

ఫ అంగుళం భూమి ఇచ్చేది లేదు

-టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం

సీఎం కేసీఆర్‌ వచ్చిన అదనపు టీఎంసీకి సెంటు భూమి ఇచ్చేది లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం అన్నారు. గ్రామసభకు వస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకుని ఆందోళన చేస్తున్న రైతుల నిరసనకు టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర జలశక్తి, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యున ల్‌ అనుమతులు లేకుండా చేపట్టిన పనులకు రైతుల భూములను బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రైతుల అంభ్యంతరాలను పట్టించుకోకుండా భూసేకరణ చేపడితే తీవ్ర పరిణామాలుంటాయని అన్నారు. మండలస్థాయి అధికారులను కాదని జిల్లా స్థాయి అధికారులు గ్రామసభలు నిర్వహిస్తు రైతులను మభ్యపెడుతున్నారన్నారు. 

Updated Date - 2022-01-26T06:04:10+05:30 IST