ఖార్కివ్‌లో ఒక్క భారతీయడిని కూడా వదిలిపెట్టబోం: భారత్

ABN , First Publish Date - 2022-03-06T00:54:24+05:30 IST

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్లో ఒక్కరిని

ఖార్కివ్‌లో ఒక్క భారతీయడిని కూడా వదిలిపెట్టబోం: భారత్

న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్లో ఒక్కరిని కూడా విడిచిపెట్టబోమని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. పిశోచిన్, ఖార్కివ్‌లో చిక్కుకుపోయిన ప్రతి ఒక్క భారతీయుడిని వెనక్కి తీసుకొస్తామని.. మరికొన్ని గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.


ఖార్కివ్‌లో అయితే, మరెవరూ లేరని తెలుస్తోందని, ఇప్పుడు తమ దృష్టినంతా సుమీపై పెట్టినట్టు చెప్పారు. పెచ్చరిల్లుతున్న హింస, సరైన రవాణా సౌకర్యం లేకపోవడం ఇప్పుడు ఇక్కడ సవాలుగా మారిందని అన్నారు. అయితే, కాల్పుల వివరణ కొంత ఊరటనిచ్చే విషయమని అన్నారు.


గత 24 గంటల్లో 15 విమానాలు 2,900 మందితో భారత్‌లో ల్యాండయ్యాయని, ఇప్పటి వరకు దాదాపు 13,300 మంది భారత్ చేరుకున్నారని వివరించారు. మరో 24 గంటల్లో ఇంకో 13 విమానాలు భారత్ చేరుకుంటాయన్నారు.  

Updated Date - 2022-03-06T00:54:24+05:30 IST