హరిద్వార్‌‌లో గంగానది పవిత్రస్నానాలపై నిషేధం

ABN , First Publish Date - 2022-01-11T18:54:29+05:30 IST

మకర సంక్రాతికి హరిద్వార్‌లోని గంగానదిలో పవిత్ర స్నానాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం..

హరిద్వార్‌‌లో గంగానది పవిత్రస్నానాలపై నిషేధం

న్యూఢిల్లీ: మకర సంక్రాతికి హరిద్వార్‌లోని గంగానదిలో పవిత్ర స్నానాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హరిద్వార్‌లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14వ తేదీ మకర సంక్రాతికి భక్తులు ఆచరించే పవిత్ర గోదావరి స్నానాలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు హరిద్వార్ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఉంటుందని తెలిపింది.



కాగా, గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,68,063 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 8,21,446కు చేరుకుంది. రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 10.64 శాతంగా నమోదైంది. 277 మంది మృతి చెందారు. దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 4,461కి చేరింది.

Updated Date - 2022-01-11T18:54:29+05:30 IST