ఆస్ట్రేలియాకు విమానాలు రద్దు: ఎయిర్ ఇండియా

ABN , First Publish Date - 2020-07-05T20:06:52+05:30 IST

వందే భారత్ మిషన్ కింద ఈనెల 4 నుంచి జూలై 14 వరకూ ఆస్ట్రేలియాకు పంపదలచిన అన్ని విమానాలను రద్దు చేశారు. కోవిడ్-19 కారణంగా ..

ఆస్ట్రేలియాకు విమానాలు రద్దు: ఎయిర్ ఇండియా

న్యూఢిల్లీ: వందే భారత్ మిషన్ కింద ఈనెల 4 నుంచి జూలై 14 వరకూ ఆస్ట్రేలియాకు పంపదలచిన అన్ని విమానాలను రద్దు చేశారు. కోవిడ్-19 కారణంగా అంతర్జాతీయ విమానాలపై ఆస్ట్రేలియా విధించిన ఆంక్షల నేపథ్యంలో ఈ విమానాలను రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది. రీషెడ్యూల్ చేసిన అన్ని ఫ్లయిట్‌లను జూలై 15 నుంచి నడుపుతామని తెలిపింది.


వందేభారత్ మిషన్ కింద ఆస్ట్రేలియాలో నిలిచి పోయిన వారిని వెనక్కి రప్పించేందుకు ఇండియా-ఆస్ట్రేలియా మధ్య విమానాలు నడపనున్నట్టు గత నెలలో ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఆ ప్రకారం జూలై 1 నుంచి 14 వరకూ వీటిని నడపాలని కూడా నిర్ణయించింది. కాగా, జూలై 3 నుంచి 4వ విడత వందే భారత్ మిషన్ ప్రారంభమైంది. ఇంతవరకూ 700 విమానాలను నడపడం ద్వారా 1.50 లక్షల భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్టు విదేశాంగ శాఖ తెలిపింది.

Updated Date - 2020-07-05T20:06:52+05:30 IST