టీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధి జాడేలేదు

ABN , First Publish Date - 2022-01-25T06:26:08+05:30 IST

తన హయాంలో చేసిన అభివృద్ధే తప్ప, నల్లగొండలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధీ జరగలేదని భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల

టీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధి జాడేలేదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నా హయాంలోనే నల్లగొండ అభివృద్ది 

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ టౌన్‌, జనవరి 24: తన హయాంలో చేసిన అభివృద్ధే తప్ప, నల్లగొండలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధీ జరగలేదని భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్లగొండలో టీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే రూపురేఖలు మారుస్తానని గత ఎన్నికల్లో చెప్పిన సీఎం కేసీఆర్‌ ఓట్లు వేయించుకొని నల్లగొండ ప్రజలను మోసం చేశార న్నారు. నియోజకవర్గాన్ని సిద్దిపేటలాగా అభివృద్ధి చేస్తారనుకుంటే మాయమాటలతో ప్రలను మోసం చేస్తున్నారని విమర్శించారు.  నల్లగొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పిన సీఎం ఇచ్చిన హామీ మర్చిపోయి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ తండ్రి మారయ్యకు నివాళులర్పించేందుకు నల్లగొండకు వచ్చారనన్నారు. సీఎంకు నల్లగొండపై ఉన్న ప్రేమతో రాలేదని, గాదరి మారయ్య పుణ్యాన నల్లగొండకు వచ్చారన్నారు. సీఎం తన సొంత నియోజకవర్గాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసుకున్నారని, కాని దత్తత తీసుకున్న నల్లగొండను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. నల్లగొండ పట్టణంలో గతంలో వేసిన రోడ్లపైనే మళ్లీ డస్ట్‌ పోసి కొత్త రోడ్లు వేసినట్లు కోట్లాది రూపాయలు  ఖర్చు చేశారని, దీనిపై తాను నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి విజిలెన్స్‌ శాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు. జిల్లాకేంద్రంలో గుంతలుపడిన రోడ్లే నేటికీ దర్శనమిస్తున్నాయని తెలిపారు. నల్లగొండ అభివృద్ధికి సహకరిస్తామని, అడ్డగోలుగా అవసరం లేని చోట రోడ్లు వెడల్పు చేస్తామంటే సహించేది లేదన్నారు. రూ.50 వేల కోట్లతో బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని అయినా పట్టించుకోవడం లేదన్నారు. మూడు నియోజకవర్గ ప్రజలకు సాగు నీరందించే ప్రాజెక్టును ప్రభుత్వం పటించుకోవడం లేదన్నారు.  పార్టీ సభ్యత్వ నమోదులో నల్లగొండ, భువనగిరి పార్లమొంటు నియోజకవర్గాలను రాష్ట్రంలోనే ముందంజలో ఉంచుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ  జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తానన్నారు. అనంతరం వివిధ సమస్యలపై కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌కు వినతిపత్రం మర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, ఎంపీపీ సుమన్‌, నాయకులు జూకూరి రమేష్‌, నర్సింగ్‌ శ్రీనివా్‌స తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T06:26:08+05:30 IST