Nizamabad: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్..చిన్నారి మృతి

ABN , First Publish Date - 2022-03-22T19:09:40+05:30 IST

జిల్లాలోని సారంగపూర్ శివారులోని విజయ డైరీ సమీపంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది.

Nizamabad: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్..చిన్నారి మృతి

నిజామాబాద్: జిల్లాలోని సారంగపూర్ శివారులోని విజయ డైరీ సమీపంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి నన్కి కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. బబ్లూ (8), జగ్గు (2) అనే చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే తల్లిదండ్రులు విజయ్ యాదవ్, ధన్వంతరి బాయి కూడా గాయపడ్డారు. క్షతగాత్రులు బీహార్‌కు చెందిన పాల వ్యాపరిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-03-22T19:09:40+05:30 IST