నిజామాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

ABN , First Publish Date - 2021-07-15T18:21:53+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 7.80 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

నిజామాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 7.80 సెంటీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు అయింది. కమ్మర్‌పల్లి మండలంలో 10.5 సెంటీ మీటర్ల వర్షం, భీంగల్‌లో 9.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో  చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. అలాగే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా కేంద్రంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

Updated Date - 2021-07-15T18:21:53+05:30 IST