Nizamabad: మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

ABN , First Publish Date - 2021-09-09T17:19:33+05:30 IST

జిల్లాలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. జూనియర్లను సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారు.

Nizamabad: మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

నిజామాబాద్: జిల్లాలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. జూనియర్లను సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారు. అర్దరాత్రి వరకు రికార్డులు రాయమని వేధించడంతో పాటు, ఇతరత్రా పనులు చెబుతున్నారంటూ జూనియర్లు తమ తల్లిదండ్రుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపల్‌కు జూనియర్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్...వైద్యులతో యాంటీ ర్యాగింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా ర్యాగింగ్ ఘటనపై మాట్లాడేందుకు కాలేజీ సిబ్బంది నిరాకరిస్తున్నారు. 

Updated Date - 2021-09-09T17:19:33+05:30 IST