పంటలపై నివర్‌ ప్రతాపం

ABN , First Publish Date - 2020-11-29T05:40:14+05:30 IST

వర్షాలకు దెబ్బతిన్న పంటల కు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం అందించాలని ఎమ్మె ల్యే గొట్టిపాటి రవికుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పంటలపై నివర్‌ ప్రతాపం
కొరిశపాడు తూర్పుపాలెంలో మినుము పంటను పరిశీలిస్తున్న కృష్ణచైతన్య


 భారీగా నష్టపోయిన రైతులు

 పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పంటల పరిశీలన

 అంచనాల తయారీలో అధికారులు


జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలపై నివర్‌ తుపాను ప్రతాపం చూపించింది. సుమారు మూడు రోజుల పాటు ఏకధాటి భారీ వర్షాలతో పంటలను నిలువునా ముంచింది. దీంతో పొలాలు నీట మునిగిపోయి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. శనివారం పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. నష్టం  అంచనాలపై కసరత్తు చేస్తున్నారు.



ఎకరాకు రూ.25వేల పరిహారం అందించాలి : ఎమ్మెల్యే గొట్టిపాటి


బల్లికురవ, నవంబరు 28 :  వర్షాలకు దెబ్బతిన్న పంటల కు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం అందించాలని ఎమ్మె ల్యే గొట్టిపాటి రవికుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ నివారం మండలంలోని గుంటుపల్లి, అంబడిపూడి గ్రామాల్లో  వరి, మెక్కజొన్న, పత్తి పంటలను రైతులతో కలిసి పరిశీ లించారు. రేపోమాపో ఇంటికి పంట వస్తుందనేలోపు తు పాను ముంచేసిందని రైతులు రవికుమార్‌ వద్ద వాపోయా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం వెం టనే ఎకరాకు రూ.25వేల పరిహారం చెల్లించాలన్నారు.  అధి కారులు రైతులకు న్యాయం జరిగేలా నివేదికలు తయారు చేయాలని చెప్పారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా మన్నారు. దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మలినేని గోవిందరావు, గొట్టి లక్ష్మయ్య, మంద లపు సుధాకర్‌, కిలారి శ్రీనివాసరావు, గొట్టిపాటి శంకర్‌, వీ రాంజనేయులు పాల్గొన్నారు.

సంతమాగులూరు : మండలంలోని కొమ్మాలపాడు, మా మిళ్ళపల్లి, కుందర్తి గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను శనివారం ఎమ్మెల్యే రవికుమార్‌ ఎమ్మెల్యే పరిశీలించారు. 


పంటనష్టం వివరాలను పక్కాగా నమోదు చేయాలి : కృష్ణ చైతన్య


పంగులూరు : తుపాను వల్ల దెబ్బతిన్న పంటల వివరాల ను పక్కాగా నమోదు చేసి, నివేదికను ప్రభుత్వానికి అందజే యాలని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణ చైతన్య అధికారులను కోరారు. శనివారం  మండలంలోని అలవలపా డు, తూర్పు తక్కెళ్లపాడు, కొప్పెరపాడు, చందలూరు, నూజెళ్లపళ్లి,  పంగులూరులో వర్షాలకు దెబ్బతిన్న మినుము, మిర ప పంటలను అధికారులు, రైతులతో కలిసి కృష్ణ చైతన్య పరిశీలించారు. ఉద్యాన అధికారి కిషోర్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ భువనేశ్వరి, ఏవో నిర్మలాదేవి, లక్ష్మీకిషోర్‌, శ్రీనివాసరెడ్డి, సు బ్బారావు, సుభాని, ఆదిరెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.

మేదరమెట్ల : : కొరిశపాడు తూర్పుపాలెంలో మిరప, మి నుము, పొగాకు పంటలను బాచిన కృష్ణచైతన్య అధికారులతో కలిసి పరిశీలించారు. నష్ట పోయిన పంట వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి అందరికీ  పరిహారం అందేలా చూస్తామ న్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఏవో శ్రీని వాసరావు, పల్లెర్ల శ్రీనివాసరెడ్డి, పులికం రవీంద్రరెడ్డి, రత్నా రెడ్డి, సాధినేని మస్తాన్‌రావు, కరణం సుబ్బయ్య, శ్రీనివాస రావు (అన్నయ్య) పాల్గొన్నారు.


1000 ఎకరాల్లో పంట మునక


అద్దంకి : పంగులూరు మండలంలోని చందలూరు గ్రా మంలో సుమారు 800 ఎకరాల్లో మిర్చి, 100 ఎకరాల్లో శనగ, 50 ఎకరాల్లో సాగు చేసిన పత్తి తుపాను కారణంగా నీట మునిగింది. చందలూరులోనే మిర్చి సాగుకు రూ.8కోట్ల వ రకు పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టపోయే పరిస్థితి నెల కొంది.  కాగా మండలంలోని తిమ్మాయపాలెంలో నీట ముని గిన శనగ పంటను వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అబ్దుల్‌ సత్తార్‌,  డాట్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ వరప్రసాద్‌ పరిశీలించా రు. ఏడీఏ ధనరాజ్‌, ఏవో వెంకటకృష్ణ పాల్గొన్నారు. 


రైతులకు పరిహారం : బూచేపల్లి


చీమకుర్తి : తుపాను వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందచేస్తుందని మాజీ ఎమ్మెల్యే బూచే పల్లి శివప్రసాదరెడ్డి హమీ ఇచ్చారు. శనివారం పాటిమీద పాలెం తదితర ప్రాంతాల్లో ముంపుకు గురైన వరి, మిరప పంటలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డీడీవో సత్తార్‌, ఏవో వెంకట్రావు, కూరాకుల రాఘవరెడ్డి, సుబ్బారెడ్డి, శేఖరరెడ్డి, గోగినేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


మిరప పొలాల పరిశీలన


ఒంగోలు (రూరల్‌) : వర్షాలు తెరపి ఇస్తేనే మిరప పంట పొలాల పరిస్థితి తేలుతుందని శాస్త్రవేత్త జి.రమేష్‌ పేర్కొ న్నారు. శనివారం ఒంగోలు మండలం యరజర్ల గ్రామంలో సాగు చేసిన మిరప చేలను ఆయన పరిశీలించారు. కార్యక్ర మంలో ఏడీఏ వి.సుభాషిణి, వీఏఏ కోటి,  పి.బ్రహ్మయ్య, దూదిపల్లి శ్రీనివసులు, కె.ఆదినారాయణ పాల్గొన్నారు.




Updated Date - 2020-11-29T05:40:14+05:30 IST