Abn logo
May 17 2021 @ 22:00PM

కరోనా బాధితులకు నిత్యావసరాల పంపిణీ

ఇందుకూరుపేట, మే 17 : కరోనా పేదల బతుకులను అతలాకుతలం  చేస్తున్నది. ఈ నేపథ్యంలో  మైపాడుకి చెందిన మాభాష, మండల యువనేత దువ్వూరు కళ్యాణరెడ్డి ఆశీస్సులతో మైపాడు, చుట్టుపక్కల గ్రామాల్లోని పేద కుటుంబాలకు అండగా నిలిచారు. 14రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు నేరుగా ఇంటికి చేరవేస్తున్నారు. ఇప్పటికే వంద కుటుంబాలకు అందచేశారు. బాధితులు ఎవరైనా ఫోన్‌ చేస్తే వీటిని అందిస్తామని ఆయన తెలిపారు. 98850 06596 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని  కోరారు. 

Advertisement